కిలో ఉల్లి కోసం లొల్లి..!

fight for kilo onions

రోజు రోజుకూ పెరుగుతున్న ఉల్లి ధరలు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. మార్కెట్ లో కిలో ఉల్లి 100 రూపాయలు దాటడంతో ఏపీ ప్రభుత్వం సబ్సిడీ మీద ఒక్కో కుటుంబానికి కేజీ ఉల్లిగడ్డలు 25 రూపాయలకు అందించే చర్యలు చేపట్టింది. కిలో ఉల్లి కోసం గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. స్టాక్ అయిపోయిందనగానే నిట్టూరుస్తూ వెనక్కి తిరిగి వెళ్లాల్సి వస్తోంది. మరోవైపు కడప రైతు బజార్ లో తగినన్ని ఉల్లి నిల్వలు అందుబాటులో లేకపోవటంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రైతు బజార్ వద్ద కిలో మీటర్ మేర క్యూలైన్ లలో వేచి ఉన్నారు మహిళలు.చిత్తూరు జిల్లాలోని రైతు బజారులో ఉల్లి పాట్లు ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఉదయం నుంచి ఉల్లి కోసం జనాలు బారులు తీరారు. క్యూలో నిల్చున్న వారి మధ్య తొక్కిసలాట జరిగింది. దీంతో పలువురు వృద్ధులు స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు.

Tags:kadapaonions

Leave a Response