ఎంపీ గోకరాజు కుటుంబం వైసీపీ గూటికి…

కాషాయ పార్టీలో కొనసాగుతోన్న మాజీ ఎంపీ గోకరాజు కుటుంబం వైసీపీ గూటికి చేరుతోంది. గోకరాజు సోదరులు నరసింహరాజు, రామరాజు, తనయుడు రంగరాజులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. గెలిచిన తర్వాత రఘురామకృష్ణంరాజు వైఖరి తేడా ఉండటంతో అతనికి చెక్ పెట్టేందుకే మళ్లీ గోకరాజు కుటుంబాన్ని పార్టీలో చేర్చుకుంటున్నారనే టాక్ నడుస్తోంది. రఘురామకృష్ణంరాజు వ్యవహార శైలి వైసీపీ అధిష్టానానికి మింగుడుపడటం లేదని, సీఎం జగన్ పదేపదే హెచ్చరించినప్పటికీ గీత దాటుతున్నారని, అందుకే గోకరాజు కుటుంబాన్ని వ్యూహాత్మకంగా పార్టీలోకి తీసుకొస్తున్నారని అంటున్నారు. ఎంతోకాలంగా గోకరాజు కుటుంబం బీజేపీకి విధేయతతో పనిచేస్తోంది. బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరించడమే కాకుండా, జాతీయ నేతలతోను, అలాగే ఆర్ఎస్ఎస్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇదిలాఉంటే, గోకరాజు కుటుంబ నిర్ణయంతో బీజేపీ షాక్ కి గురైనట్లు తెలుస్తోంది.

Tags:bjp partygokarajuycp party

Leave a Response