పెళ్లి చేసుకోనన్న తేజు…

ఈటీవీలో ప్రసారం అవుతున్న షో ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో సాయితేజ్ మాట్లాడుతూ, తనకి సంబంధించిన అనేక విషయాలను ఆయన పంచుకున్నాడు. “పెద్ద మావయ్య చేసిన సినిమాల్లో ‘చంటబ్బాయ్’ అంటే నాకు చాలా ఇష్టం. ‘చంటబ్బాయ్’కి సీక్వెల్ అని కాదుగానీ, ఆ జోనర్లో చేయాలనుంది. ఇక చిన్న మావయ్య పవన్ కల్యాణ్ చేసిన సినిమాల్లో ‘ఖుషీ’ .. ‘తొలిప్రేమ’ అంటే చాలా ఇష్టం. ఆ తరహా కథలను చేయాలనుంది’ అంటూ చెప్పాడు. ‘ఇంతకీ పెళ్లి’ ఎప్పుడూ?’ అంటూ అలీ అడిగిన ప్రశ్నకి సాయిధరమ్ తేజ్ సిగ్గుపడిపోయాడు. ‘నేను పెళ్లి చేసుకోను’ అని సమాధానం ఇచ్చాడు. ‘ఇప్పుడు పెళ్లి చేసుకోవా? లేదంటే అసలే చేసుకోవా?’ అనే ప్రశ్నకి మాత్రం స్పష్టత ఇవ్వకుండా నవ్వేశాడు. మేనమామల సినిమాల విషయంలో తేజు కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.

Image result for saidharamtej

Leave a Response