రామజోగయ్య శాస్త్రి రచించిన ‘బుట్టబొమ్మా..’ పాట…

త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘అల వైకుంఠపురములో’ సినిమా నుంచి మరో పాట విడుదలైంది. ‘ఇంతకన్న మంచి పోలికేది నాకు తట్టలేదు కానీ అమ్మో, ఈ లవ్ అనేది బబ్లుగమ్.. అంటుకున్నాదంటే పోదు నమ్మో.. బుట్ట బొమ్మా బుట్ట బొమ్మా..నన్నూ సుట్టుకుంటివే..’ అంటూ ఈ పాట కొనసాగింది. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాటకు తమన్ సంగీతం అందించాడు. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటించింది. సంక్రాంతి కానుకగా వచ్చే నెల 12న విడుదల కానుంది. ఇంకా సినిమా కోసం తన అభిమానులు ఎంతగానో ఎదురు చుస్తునారు.

Leave a Response