వెంకటేశ్, నాగచైతన్య హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా చిరంజీవి

వెంకటేశ్, నాగచైతన్య కాంబినేషన్లో వచ్చిన ‘వెంకీ మామ’ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. బాక్సీఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రాన్ని చిరంజీవి ప్రత్యేకంగా వీక్షించారు. అనంతరం ఆయన ఓ వీడియో ద్వారా తన స్పందనను వ్యక్తం చేశారు.’మా ఫ్యామిలీ మొత్తం ‘వెంకీ మామ’ సినిమాను చూశాం. ఈ సినిమా మాకు బాగా నచ్చింది. ఎంతో ఎంజాయ్ చేశాం. దానికి ప్రధాన కారణం మిత్రుడు వెంకటేశ్. తన స్టైల్లో కామెడీ, ఎమోషన్స్, సెంటిమెంట్స్ సీన్స్ తో అద్భుతంగా రాణించి, మెప్పించి, ఒప్పించారు. చాలా కాలం తర్వాత యాక్షన్ సన్నివేశాల్లో కూడా ‘వావ్’ అనిపించారు. ఈ సినిమా సక్సెస్ కు ప్రధాన కారణమైన వెంకటేష్ ను మనస్పూర్తిగా అభినందిస్తున్నా.మామకు తగ్గ అల్లుడిగా నాగచైతన్య కూడా చాలా మెచ్యూర్డ్ గా పెర్ఫామ్ చేశాడు. ఈ సినిమా సక్సెస్ లో చైతన్య కూడా భాగస్వామి అయ్యాడు. దర్శకుడు బాబీ తన స్టైల్లో ఆద్యంతం సినిమాను రసవత్తరంగా నడిపించాడు. ఈ సినిమా ఇంతటి సక్సెస్ ను సాధించినందుకు ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా’ అని చిరంజీవి తెలిపారు.

Leave a Response