జీఎస్టీ రూపంలో భారీగా చెల్లించుకున్న రామ్‌చరణ్

టాలీవుడ్ అగ్రనటుడు చిరంజీవి ప్రధాన పాత్రలో ఆయన తనయుడు రాంచరణ్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘సైరా’ సినిమాకు జీఎస్టీ రూపంలో భారీ షాక్ తగిలింది. బాక్సాఫీసు వద్ద సంచలన విజయాన్ని అందుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఈ సినిమాకు ఇప్పుడు జీఎస్టీ రూపంలో మరో ఎదురుదెబ్బ తగిలింది.స్వాతంత్ర్య సమరయోధుడి గాధతో తెరకెక్కించిన ఈ సినిమాకు నిజానికి ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు ఉంటుందని భావించారు. అయితే, ఈ విషయంలో మెగా ఫ్యామిలీకి నిరాశ ఎదురైంది. దీంతో జీఎస్టీ రూపంలో భారీగా చెల్లించుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఈ సినిమాకు జీఎస్టీ రూపంలో రాంచరణ్ ఏకంగా రూ. 20 కోట్ల వరకు చెల్లించినట్టు టాలీవుడ్ టాక్.

Leave a Response