తేజు నుంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్

సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా దర్శకుడు మారుతి రూపొందించిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమా, ఈ నెల 20వ తేదీన విడుదల కానుంది. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక సాంగ్ ను విడుదల చేశారు.”కనుబొమ్మే నువ్వు కనబడితే సరి కలలెగరేసెనుగా .. కనుకేమో తలకిందులుగా పడి మది మది తిరిగెనుగా .. హైరానా పడిపోయా .. హాయిని వదిలిన ఎద వలన .. ఇంకొంచెం అడిగేశా తీయని హాయిని వద్దనక .. యూ ఆర్ మై హై” అంటూ ఈ పాట సాగుతోంది. యూత్ కి నచ్చేలా ఈ పాటను చిత్రీకరించారు. సింగర్ దీపుతో కలిసి రాశి ఖన్నా ఈ పాట పాడటం విశేషం. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో సత్యరాజ్ కీలకమైన పాత్రను పోషించారు. ఈ సినిమాలో ఆయన పాత్ర హైలైట్ కానుందని అంటున్నారు. తేజు – రాశి ఖన్నా కలిసి మరోసారి హిట్ కొడతారేమో చూడాలి.

Leave a Response