బాలకృష్ణ తదుపరి ప్రాజెక్టులో సోనాక్షి సిన్హా

బాలకృష్ణ అభిమానులంతా ఆయన తాజా చిత్రమైన ‘రూలర్’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో వైపున బాలకృష్ణ తదుపరి ప్రాజెక్టుతో సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన తదుపరి సినిమాకి బోయపాటి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా సోనాక్షి సిన్హా నటించనున్నట్టుగా రెండు మూడు రోజులుగా వార్తలు వస్తున్నాయి.అయితే దక్షిణాదిన జోరుగా జరుగుతున్న ఈ ప్రచారం ఉత్తరాదిన వున్న సోనాక్షికి చేరిపోయింది. దాంతో ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా ఈ విషయంపై ఆమె స్పందించింది. బాలకృష్ణ – బోయపాటి సినిమాలో తను నటించనున్నట్టుగా వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదనీ, అనవసరమైన ప్రచారాలను నమ్మవద్దని చెప్పింది. తన తదుపరి ప్రాజెక్టు ఏమిటనే విషయంపై త్వరలోనే క్లారిటీ ఇస్తానంటూ పుకార్లకు తెర దింపేసింది.

Leave a Response