విడుదలకి ముస్తాబవుతున్న ‘రూలర్’

బాలకృష్ణ కథానాయకుడిగా కేఎస్ రవికుమార్ రూపొందించిన ‘రూలర్’ సినిమా, ఈ నెల 20వ తేదీన ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్ – వేదిక కథానాయికలుగా అలరించనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.తాజా ఇంటర్వ్యూలో వేదిక మాట్లాడుతూ .. “ఈ సినిమాలో నేను చాలా గ్లామరస్ గా కనిపిస్తాను. అలాగే నటనకి అవకాశం వున్న పాత్ర కూడా. నా పాత్ర అందరికీ బాగా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నాను. తొలిసారిగా బాలకృష్ణగారితో కలిసి నటించడం ఎంతో ఆనందాన్నిస్తోంది. ఆయనతో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన సింప్లిసిటీ .. నటనపట్ల గల అంకితభావం నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి” అని చెప్పుకొచ్చింది.

Leave a Response