వెంకీ మామ’ వెండితెర వెలిగిపోయేలా నటించారంటూ కామెంట్

సక్సెస్ టాక్ తో కలెక్షన్లు రాబడుతున్న ‘వెంకీ మామ’ చిత్రంపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పందించారు. సరైన వినోదం కావాలంటే ‘వెంకీ మామ’ చిత్రం చూడాల్సిందేనని ట్వీట్ చేశారు. ఈ సినిమాను నిజంగా ఎంతో ఆస్వాదించానని వెల్లడించారు. మామ-అల్లుడు కెమిస్ట్రీతో వెంకటేశ్ గారు, నాగచైతన్య వెండితెరను జిగేల్మనిపించారని కితాబిచ్చారు. భావోద్వేగాలు, హాస్యం, కుటుంబ విలువలు పక్కాగా పండిన నికార్సయిన సినిమా ‘వెంకీ మామ’ అని మహేశ్ బాబు కొనియాడారు. చిత్ర యూనిట్ మొత్తానికి శుభాభినందనలు అంటూ ట్వీట్ చేశారు.

Leave a Response