70 కోట్ల బడ్జెట్ తో సెట్స్ పైకి వెళ్లనున్న పవన్

హిందీలో ఆ మధ్య వచ్చిన ‘పింక్’ సినిమా వైవిధ్యభరితమైన చిత్రంగా ప్రశంసలు అందుకుంటూ, భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాను ఇటీవల అజిత్ హీరోగా తమిళంలో రీమేక్ చేయగా అక్కడ కూడా అనూహ్యమైన విజయాన్ని అందుకుంది. దాంతో ఈ సినిమాను తెలుగులో పవన్ కథానాయకుడిగా రీమేక్ చేయడానికి ‘దిల్’ రాజు ప్రయత్నిస్తున్నాడు.రాజకీయాల్లో బిజీగా వున్న పవన్ ను త్రివిక్రమ్ ద్వారా ‘దిల్’ రాజు ఒప్పించాడు. ఈ సినిమాకిగాను ఆయన పవన్ కి 50 కోట్ల పారితోషికాన్ని ఇవ్వనున్నట్టు సమాచారం. ఆయన పారితోషికం పోగా మిగతా 20 కోట్లతో రెండు నెలలలో సినిమాను పూర్తి చేసే ఆలోచనలో ‘దిల్’ రాజు ఉన్నాడట. పవన్ తో సినిమా తీయాలనే బలమైన కోరిక కారణంగానే ‘దిల్’ రాజు ఈ ప్రాజెక్టుపై 70 కోట్లు పెడుతున్నాడని అంటున్నారు. ఇప్పటికే ముఖ్య పాత్రల కోసం నివేదా థామస్ .. అంజలి .. అనన్యను తీసుకున్నారు.

Leave a Response