రజనీకాంత్ ‘దర్బార్’ చిత్రం ట్రైలర్

రజనీకాంత్, నయనతార జంటగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘దర్బార్’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలవుతోంది. తాజాగా ఈ చిత్రం అఫీషియల్ ట్రైలర్ వచ్చింది. ‘దర్బార్’ లో రజనీకాంత్ మార్కు వినోదం పుష్కలంగా ఉన్నట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.”అయాం ఏ బ్యాడ్ కాప్” (నేను మహా చెడ్డ పోలీసును) అంటూ రజనీ చెప్పే డైలాగు అభిమానులను తప్పకుండా అలరిస్తుంది. “పోలీసుల వద్దకు లెఫ్ట్ లో రావొచ్చు, రైట్ లో రావొచ్చు కానీ స్ట్రెయిట్ గా రాకూడదు” అనే డైలాగ్ మరింత రక్తికట్టించేలా ఉంది. లైకా ప్రొడక్షన్స్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘దర్బార్’ లో రజనీకాంత్ ‘ఆదిత్య అరుణాచలం’ అనే పోలీసాఫీసర్ పాత్ర పోషించారు. ముంబయి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ప్రతినాయక పాత్ర పోషించాడు.

Leave a Response