అశ్వద్ధామ’గా నాగశౌర్య రొమాంటిక్ సాంగ్

నాగశౌర్య .. మెహ్రీన్ జంటగా రూపొందిన ‘అశ్వద్ధామ’ చిత్రం ద్వారా రమణ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ ప్రేమకథా చిత్రం కోసం కుర్రాళ్లంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి ఒక రొమాంటిక్ సాంగ్ ను తాజాగా రిలీజ్ చేశారు.”నిన్నే నిన్నే ఎదలో నిన్నే .. చెలియా నీకై నే వేచానులే.. అలుపే రాదే .. అదుపే లేదే .. అయినా సమయం సరిపోదులే ” అంటూ ఈ పాట సాగుతోంది. నాగశౌర్య .. మెహ్రీన్ పై చిత్రీకరించిన ఈ పాట అందంగా .. ఆహ్లాదంగా అనిపిస్తోంది. రమేశ్ వాకచర్ల సాహిత్యం .. అర్మాన్ మాలిక్ – యామినీ ఘంటసాల ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. మేకింగ్ షాట్స్ ను జోడిస్తూ వదిలిన ఈ సాంగ్ యూత్ ను ఆకట్టుకునేలా వుంది. సొంత బ్యానర్లో నాగశౌర్య చేసిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Response