పాయల్ రోహత్గీ కు రూ.25 వేల పూచీకత్తుపై బెయిలు

భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేసి జైలుపాలైన సినీ నటి పాయల్ రోహత్గీ బెయిలుపై విడుదలైంది. నెహ్రూ కుటుంబాన్ని విమర్శిస్తూ పాయల్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఇటీవల కలకలం రేపాయి. ఆ పోస్టులపై యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి  చర్మేష్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసుకున్న రాజస్థాన్ పోలీసులు ఈ నెల 15న పాయల్‌ను అరెస్ట్ చేశారు. 8 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ అనంతరం రూ.25 వేల పూచీకత్తుపై కోర్టు ఆమెకు బెయిలు మంజూరు చేసింది. జైలు నుంచి విడుదలైన పాయల్‌కు అభిమానులు స్వాగతం పలికారు.

Leave a Response