ఆయన లేని లోటు తీరనిది…

నూర్ మహ్మద్ దశాబ్దాలుగా మెగా అభిమాని. చిరంజీవిని విపరీతంగా అభిమానించే నూర్ మహ్మద్ మృతి చెందారన్న వార్త తెలియడంతో మెగా హీరోలు విచారం వ్యక్తం చేశారు. వెంటనే నూర్ నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అల్లు అర్జున్ కూడా నూర్ భౌతికకాయాన్ని సందర్శించారు. తాజాగా మెగా పవర్‌ స్టార్‌ రాంచరణ్‌ మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి రూ.10 లక్షల విరాళం అందిస్తున్నట్టుగా ప్రకటించారు. “గతంలో ఆయన ఆసుపత్రి పాలైతే నేనే స్వయంగా పరామర్శించాను. అక్కడి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం చేయించాను. కానీ నిన్న ఆయన మరణవార్త విన్న వెంటనే చలించిపోయాను. ఆయన లేని లోటు తీరనిది. మెగా బ్లడ్‌ బ్రదర్‌ ‘నూర్‌ అహ్మద్‌’ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నా’నని ఆన్నారు. అల్లు శిరీష్, మా పుట్టినరోజులను తన పుట్టినరోజు అన్నట్టుగా జరిపేవాడు. పండుగ వేళల్లో రుచికరమైన వంటకాలు పంపించి, మాపై అపారమైన అభిమానాన్ని చూపించేవాడు అంటూ స్మరించుకున్నారు.సాయిధరమ్ తేజ్ కూడా ట్విట్టర్ లో తన విచారాన్ని వ్యక్తం చేశారు.

Tags:noor basha

Leave a Response