నిర్వాహకులు, అభిమానుల మధ్య తోపులాట…

సాయిధరమ్ తేజ్ కెరియర్ తొలినాళ్లలో మంచి కథలు పడటంతో హిట్లు ఇస్తూ వెళ్లాడు. ప్రస్తుతం తేజు వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్నాడు. ‘గీతా ఆర్ట్స్ 2’ బ్యానర్ పై అల్లు అరవింద్ తేజుతో ‘ప్రతిరోజూ పండగే’ అనే సినిమాతో మళ్ళీ నిలబెట్టగలుగుతారో లేదో చూడాలి. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వచ్చేనెల 20వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రమోషన్‌ లో భాగంగా గుంటూరు భాస్కర్‌ థియేటర్‌కు హీరో సాయిధరమ్‌ తేజ్, కథానాయకి రాశీఖన్నా పాల్గొన్నారు. వారి వెనుకే అభిమానులు పెద్ద సంఖ్యలో బౌన్సర్‌లను తోసుకొచ్చారు. సాయిధరమ్‌ తేజ్‌ మైకు తీసుకోగా ఆకతాయిలు అల్లరి చేయడం మొదలెట్టారు. దీంతో హీరో హీరోయిన్లు థియేటర్‌ పైఅంతస్తుకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులు, అభిమానుల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అనుకూలించిన తర్వాత అంధ విద్యార్థులకు చెక్కుల పంపిణీ చేశారు.

Tags:maruthiprathi roju pandagesaidharam tej

Leave a Response