దేశంని వణికిస్తున్న ఉష్ణోగ్రతలు…

పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, బీహార్ లో పొగ మంచు కురుస్తూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఛత్తీస్ గడ్, ఒడిశా, జార్ఖండ్ లో చలి మొదలైయ్యింది. తూర్పు భారతదేశంలో మధ్యాహ్నం వాతావరణం పొడిగా ఉంటూ సాయంత్రానికి ఉష్ణో గ్రతలు పడిపోతున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లోనూ చలికాలం మొదలైయ్యింది.కర్ణాటక, కేరళలో పూర్తిగా వర్ష ప్రభావం తగ్గింది. తమిళనాడులో ఉరుములతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో వాతావరణం చలిగా ఉంటూ రాత్రయితే మాత్రం చలి ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. గడిచిన 24 గంటలలో ఆదిలాబాద్ లో 12 డిగ్రీల సెల్సియస్ గా రికార్డైంది. ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే ఏపీలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటలలో నెల్లూరులో 4 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. రాయలసీమలోనూ అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.

Tags:low temperature

Leave a Response