భారత్‌ X పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ విశేషాలు

భారత్‌ X పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ అంటే యావత్‌ క్రీడాభిమానులకు ఎంత ఆసక్తి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇరు దేశాలే కాకుండా ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్‌ వీక్షించేందుకు ఇష్టపడతాయి. ఇక ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లూ తలపడితే ఆ అంచనాలు ఎలా ఉంటాయో ఊహించడం కష్టం. వరల్డ్‌కప్‌లో ఇరు జట్లు ఆరుసార్లు తలపడగా 2019లో మరోసారి ఢీ అంటే ఢీ అనేందుకు సిద్ధమయ్యాయి. జూన్‌ 16న ఇరు జట్ల మధ్య జరగబోయే ఏడో ప్రపంచకప్‌ మ్యాచ్‌లో టీమిండియానే ఫేవరెట్‌గా కనిపిస్తోంది. అందుకు కారణం ప్రపంచకప్‌లో వీటి మధ్య జరిగిన ఆరు మ్యాచ్‌ల్లోనూ భారత్‌ జట్టు జయకేతనం ఎగరవేసింది. ఈ నేపథ్యంలో ఆ మ్యాచ్‌ల ఫలితాలు, విశేషాలు ఒకసారి పరిశీలిద్దాం. .. ఆడిన సందర్భాలు.. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ విశేషాలు1992 ప్రపంచకప్‌లో 43 పరుగులతో విజయంఆస్ట్రేలియాలో జరిగిన 1992 ప్రపంచకప్‌లో భారత్‌ -పాకిస్థాన్‌ తొలిసారి తలపడ్డాయి. సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 43 పరుగులతో గెలిచింది. తొలుత టాస్‌ గెలిచిన మహ్మద్‌ అజహరుద్దీన్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. సచిన్‌ తెందూల్కర్ (54; 62 బంతుల్లో 3×4) అర్ధశతకంతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన పాక్‌ 48.1 ఓవర్లలో పది వికెట్లు కోల్పోయి 173 పరుగులే చేసింది. భారత్‌ 43 పరుగులతో విజయం సాధించగా సచిన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు. 1996 ప్రపంచకప్‌లో 39 పరుగులతో విజయంభారత్‌లో జరిగిన 1996 ప్రపంచకప్‌లో ఇరు జట్లూ రెండోసారి తలపడ్డాయి. బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 39 పరుగులతో గెలిచింది. ఇందులోనూ మొదట టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. అజహరుద్దీన్‌ కెప్టెన్సీలోనే భారత్‌ ఎనిమిది వికెట్లు కోల్పోయి 50 ఓవర్లలో 287 పరుగులు చేసింది. ఓపెనర్‌గా దిగిన నవ్‌జోత్‌ సింగ్‌ సిద్దూ (93; 115 బంతుల్లో 11×4) త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన పాకిస్థాన్‌ 248/9కే పరిమితమైంది. అనిల్‌ కుంబ్లే, బీకేవీ ప్రసాద్‌ తలో మూడు వికెట్లు తీసి పాక్‌ నడ్డి విరిచారు. కాగా అత్యధిక పరుగులు సాధించిన సిద్దూ ‘మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌’గా నిలిచాడు. 1999 ప్రపంచకప్‌లో 47 పరుగులతో జయకేతనంఇంగ్లాండ్‌లో జరిగిన 1999 ప్రపంచకప్‌లో మాంచెస్టర్‌ వేదికగా భారత్‌ X పాక్‌ మూడోసారి తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లోనూ టాస్‌ గెలిచిన అజహరుద్దీన్‌ తొలుత బ్యాటింగే ఎంచుకున్నాడు. భారత్‌ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో రాహుల్‌ ద్రవిడ్‌ (61;89 బంతుల్లో 4×4) అత్యధిక పరుగులు చేశాడు. లక్ష్యఛేదనకు దిగిన పాకిస్థాన్‌ను వెంకటేశ్‌ ప్రసాద్‌ దడదడలాడించాడు. ఐదు వికెట్లతో చెలరేగడంతో పాక్‌ 180 పరుగులకే కుప్పకూలింది. భారత్‌ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన వెంకటేశ్‌ ప్రసాద్‌కే ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. 2003 ప్రపంచకప్‌లో 6 వికెట్లతో విజయందక్షిణాఫ్రికాలో జరిగిన 2003 ప్రపంచకప్‌లో రెండు జట్లు నాలుగోసారి తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాక్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకొని టీమిండియా ముందు భారీ టార్గెట్‌ నిర్దేశించింది. సయీద్‌ అన్వర్‌(101; 126 బంతుల్లో 7×4) శతకంతో చెలరేగగా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ను సచిన్‌ తెందూల్కర్‌(98; 75 బంతుల్లో 12X4, 1×6) ఆదుకున్నాడు. త్రుటిలో శతకం చేజారినా సచిన్‌ జీవితంలో ఇదొక అద్భుతమైన ఇన్నింగ్స్‌గా నిలిచిపోయింది. ఆఖర్లో యువీ(50; 53 బంతుల్లో 6×4) అర్ధశతకంతో చెలరేగి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఛేదనలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోవడంతో భారత్‌ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. కాగా ఈ మ్యాచ్‌లో సచిన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ లభించింది.2011 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో 29 పరుగులతో గెలుపుభారత్‌లో జరిగిన 2011 సెమీఫైనల్స్‌లో ఇరు జట్లు ఐదోసారి తలపడ్డాయి. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌(85; 115 బంతుల్లో 11×4) మరోసారి చెలరేగడంతో భారత్‌ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ధోనీ సారథ్యంలోని టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేసి తొమ్మిది వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పాక్‌ 231 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ మిస్బా ఉల్‌ హాక్‌ (56; 76 బంతుల్లో 5×4,1×6) అర్ధశతకంతో చెలరేగినా భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో ఇతర బ్యాట్స్‌మెన్‌ నిలవలేకపోయారు. జహీర్‌ఖాన్‌, ఆశిశ్‌ నెహ్రా, మునాఫ్‌ పటేల్‌, హర్భజన్‌సింగ్‌, యువరాజ్‌ సింగ్‌ తలో రెండు వికెట్లు తీయడం విశేషం. ఈ మ్యాచ్‌లోనూ సచిన్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా ఎంపికవ్వడంతో ప్రపంచకప్‌లో భారత్‌ X పాక్‌ మ్యాచ్‌ల్లో అత్యధికసార్లు ఈ ఘనత సాధించిన ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు.2015 ప్రపంచకప్‌లో 76 పరుగులతో భారీ విజయంఆస్ట్రేలియాలో జరిగిన ఈ టోర్నీలో భారత్‌ తొలిసారి 76 పరుగుల భారీ తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. అడిలైడ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ(107; 126 బంతుల్లో 8×4) శతకంతో చెలరేగాడు. అతడికి శిఖర్‌ ధావన్‌(73), సురేశ్‌రైనా(74) సహకరించగా తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 300 భారీ స్కోరు సాధించింది. లక్ష్యఛేదనలో పాక్‌ 224 పరుగులకే కుప్పకూలింది. మిస్బా ఉల్‌ హాక్‌ (76; 84 బంతుల్లో 9×4, 1×6) మరోసారి మెరిసినా మిగతా బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు. దీంతో విరాట్‌కోహ్లీ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు.

Leave a Response