వైస్ జగన్ కాబినెట్

ఆంధ్ర రాష్ట్రము పూర్తిస్థాయిలో మంత్రివ‌ర్గం ఏర్పాటు కానుంది. మంత్రుల ప్ర‌మాణ స్వీకారానికి రాజ‌ధాని ప్రాంతంలోని వెల‌గ‌పూడిలో తాత్కాలిక స‌చివాల‌యం ప‌రిస‌ర ప్రాంగ‌ణం సిద్ధం కాబోతుంది. శ‌నివారం ఉద‌యం 10 గంట‌ల స‌మ‌యంలో ప్రమాణ స్వీకారం ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ మంత్రులతో ప్ర‌మాణం చేయిస్తారు. దీనికోసం ఆయ‌న శుక్ర‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌కు రానున్నారు.

రాష్ట్ర మంత్రివ‌ర్గంలో ఇద్ద‌రు మైనారిటీల‌కు చోటు ఉండొచ్చ‌ని సమాచారం. హిందూపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి, ఓడిపోయిన ఇక్బాల్‌కు మంత్రివ‌ర్గంలోకి తీసుకుంటానని వైఎస్ జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. గుంటూరు పోలీస్ ప‌రేడ్ గ్రౌండ్స్‌లో ముస్లిం నాయ‌కుల‌కు ఇచ్చిన ఇఫ్తార్ విందులో ఆయ‌న స్వ‌యంగా ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలో మైనారిటీ కోటాలో ఇక్బాల్‌కు బెర్త్ ఖాయ‌మైందనుకోవచ్చు. గుంటూరు జిల్లా నుంచి వ‌రుస‌గా రెండోసార్లు అసెంబ్లీకి ఎన్నికైన ముస్తఫాకు కూడా మంత్రివ‌ర్గంలోకి తీసుకుంటారా? లేదా? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

andhra-pradesh/ysrcp-senior-leader-janga-krishnamurthy-likely-to-get-key-post-in-ys-jagan-

Leave a Response