భార్యను కాల్ గర్ల్ గా మార్చిన భర్త..!

కుషాయిగూడలోని రాధికా థియేటర్ లో ప్రొజెక్టర్ ను ఆపరేట్ చేసే జాన్ జార్జ్ అనే వ్యక్తి, భార్యతో కలిసి లక్ష్మీ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు.ఇంట్లో చిన్న చిన్న విషయాలకే భార్య గొడవ పడుతూ ఉండటంతో, ఆమెపై పగ తీర్చుకోవాలని భావించాడు. తనతో గొడవ పడుతున్న భార్య పరువు తీయాలని భావించిన ఓ వ్యక్తి, నీచపు పనికి ఒడిగట్టి, కటకటాల పాలయ్యాడు.ఫ్రెండ్స్ తో కలిసి దిగిన ఫోటోలను సేకరించి, సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ, దానిలో కనిపిస్తున్న వారంతా కాల్ గర్ల్స్ అని వాయిస్ ఇచ్చాడు. కింద తన భార్య సెల్ ఫోన్ నంబర్ ను కూడా ఇచ్చాడు. బాధితురాలికి ఫోన్ల మీద ఫోన్లు రావడంతో ఆ వేధింపులు తట్టుకోలేక రాచకొండ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి, విచారణ చేపట్టిన పోలీసులు దీని వెనకున్నది జాన్ జార్జేనని తేల్చి అరెస్ట్ చేశారు.

Tags:call girlcyber crimewife and husband

Leave a Response