స్వాతంత్ర్య దినోత్సవం నుంచి గాంధీ జయంతికి వాయిదా…?

టాలీవుడ్ సీనియర్ హీరో చిరంజీవి నటిస్తున్న సినిమా ” సైరా”. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో చరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా చివరి దశకి చేరుకుంది. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనీ అనుకున్నారు, కానీ అప్పటికి అనుకున్న పనులు పూర్తికావనే ఉద్దేశంతో, అక్టోబర్ 2వ తేదీకి వెళ్లినట్టుగా వార్తలు వచ్చాయి. దర్శక నిర్మాతలు బాగా ఆలోచించి ఈ తేదీనే ఖాయం చేసుకున్నారనేది తాజా సమాచారం. చారిత్రక నేపథ్యంతో కూడిన కథ కావడం .. స్వాతంత్య్ర పోరాటంతో ముడిపడిన కథ కావడం వలన అక్టోబర్ 2వ తేదీనే ఈ సినిమాను విడుదల చేయడం కరెక్ట్ అనే ఉద్దేశంతో ఈ తేదీని ఖరారు చేశారు.Image result for saira movie photos

Leave a Response