నిందితుల్ని వెంటనే ఉరితీయాలి….

వరుస ఘటనలు సామాన్యుల్లో ఆవేశం కట్టలు తెంచుకునేలా చేసాయి. ముఖ్యంగా హైదరాబాద్ షాద్ నగర్ లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డిని నలుగురు దుర్మార్గులు అత్యంత కిరాతకంగా రేప్ చేసి హత్య చేయడంతో ఆ నలుగుర్ని చంపేయాలని డిమాండ్ చేశారు. ఇంకోసారి ఆడవారిపై చెయ్యి వేయాలంటేనే భయపడేలా నడిరోడ్డు మీద ఉరితీయాలని, ఎన్కౌంటర్ చేయాలనీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. షాద్‌నగర్‌ పోలీస్ స్టేషన్‌కు స్థానికులు, ప్రజా సంఘాల కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు జనాన్ని చెదరగొట్టేందుకు స్వల్పంగా లాఠీ ఛార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. అయినా జనం వెనకడుగు వేయలేదు. నిందితులను బయటకు తీసుకెళ్తే జనావేశాన్ని కంట్రోల్ చేయడం కష్టమని భావించిన పోలీసులు నిందితుల్ని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించాల్సి ఉన్నా పరిస్థితి దానికి అనుకూలంగా లేకపోవడంతో డాక్టర్లనే స్టేషన్ కి తీసుకొచ్చి మరీ పరీక్షలు చేయించారు. నిందితులకు 14 రోజుల రిమాండ్‌ను విధించారు.

Tags:doctor priyanka reddypolice station

Leave a Response