మత్తులో అమరావతి…

రాజధానితో పాటు 13 జిల్లాల్లో మత్తుపదార్ధాల వినియోగం. రాజధాని ప్రాంతం కావడంతో విజయవాడ, గుంటూరు జిల్లాల్లో విదేశీయులు ఎక్కువగా రాకపోకలు జరుగుతున్నాయి. రాజధాని ప్రాంతంలో గంజాయితో పాటు వైట్నర్ లాంటి పదార్థాలను సైతం విద్యార్ధులు ఆశ్రయిస్తున్నారు. మత్తు పదార్ధాలు సేవించిన విద్యార్థులు ఏకంగా అధ్యక్షుడి పైనే దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు విద్యార్థుల రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. ఈ ఫలితాల్లో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. గంజాయితో పాటుగా ఇతర మత్తు పదార్థాలను వినియోగిస్తున్న విదేశీ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. మంగళగిరిలోని ఓ ప్రైవేటు కళాశాలలో జరిగిన ఘర్షణ వ్యవహారంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఓ అపార్ట్ మెంట్ లో నివసిస్తున్న షాజీ నుంచి గంజాయితో పాటుగా తెల్లరంగు పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు. ఏపీ కేంద్రంగా జరుగుతున్న మత్తు పదార్ధాల రవాణాపై డీజీపీ సవాంగ్ ప్రత్యేకంగా సిఐడి ఆధ్వర్యంలో నార్కోటిక్ సెల్ ను రంగంలోకి దించారు.

Tags:

Leave a Response