రోజాను కాదనా జగన్…

చిత్తూరు జిల్లాలోని 14 నియోజక వర్గాల్లో 13 స్థానాలను కైవసం చేసుకుని తన సత్తా చాటింది వైసిపి. అధికారం లేకున్నా గడిచిన 5 ఏళ్లు జిల్లాలో పార్టీకి అన్ని విధాలా అండదండలు అందించారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ హయాంలో 2 సార్లు మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి జగన్ సర్కర్ లోనూ కీలక మంత్రి పదవి దక్కించుకున్నారు.కాకపోతే జిల్లాలోని రిజర్వ్ నియోజకవర్గమైన జీడీ నెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నారాయణ స్వామికి అనూహ్యంగా ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఇదివరకు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా కూడా పని చేశారు. ఏళ్ల నుంచి మంచి మిత్రులుగా ఉన్న పెద్దిరెడ్డి , నారాయణస్వామిల మధ్య ఇప్పుడు కోల్డ్ వార్ నడుస్తోంది. ఉద్యోగుల బదిలీలు, కాంట్రాక్టు నియామకాల్లో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. కాకపోతే అదంతా ఉత్తుత్తి ప్రచారమే కానీ తమ మధ్య అలాంటిదేమి లేదని అంటున్నారు నారాయణ స్వామి. జిల్లా నుంచి రోజా, భూమన కరుణాకరరెడ్డి లాంటి వ్యక్తులను కాదని ఎస్సీ కోటాలో నారాయణ స్వామికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు సీఎం జగన్.

Tags:jagan mohan reddyroja

Leave a Response