దిక్కుతోచని స్థితిలో రాజధాని…

రాజధాని రైతులతో పాటు అమరావతి శ్రేయోభిలాషులకు ఈ వార్త ఊరట నిచ్చింది. రాజధానికి అత్యంత కీలకమైన అసెంబ్లీ, హై కోర్టు, సచివాలయం శాఖాధిపతుల కార్యాలయాల నిర్ణయాన్ని నిపుణుల కమిటీ నివేదిక మేరకే తీసుకుంటామని పేర్కొంది. రాజధాని అనే పదానికి సార్థకత చేకూర్చే ముఖ్యమైన శాసన సభ సచివాలయం హై కోర్టులపై నిర్ణయం తర్వాత తీసుకుంటామనడంతో దాని సంగతి ఏమవుతుందోనన్న సందేహం కొనసాగుతూనే ఉంది. ప్లాట్ ల ధరలు భారీగా తగ్గి దిక్కుతోచని స్థితిలో ఉన్న రాజధాని నిజానికి సీఎం ఇటీవల చేసిన ప్రకటన కొంత మేలు చేసింది. దీంతో నెలలుగా నీరసించిన ఈ ప్రాంత రియల్టర్లు, ప్లాట్ ల యజమానులు తిరిగి తమకు మంచి రోజులు వచ్చినట్లేనని భావిస్తున్నారు. రాజధాని లోని తమ ప్లాట్ లను తక్కువ ధరకైనా విక్రయిద్దామని అనుకున్నారు వారు కూడా ఆ ఆలోచనను వాయిదా వేసుకుంటున్నారు. ఎన్నికల సమయంతో పోల్చితే దాదాపు 40-50% శాతం పడిపోయిన ధరలు కూడా విక్రయించేందుకు సిద్ధమైన , సీఎం ప్రకటనతో ధరలు గణనీయంగా పెరుగుతాయి అన్నా ఆశతో ఉన్నారు.

Tags:jagan mohan reddy

Leave a Response