కఠిన చట్టాలు తీసుకోరావాలి…

శంషాబాద్ లో వైద్యురాలిపై జరిగిన హత్యాచారం కేసుపై ఇప్పటికే అటు మహిళా సంఘాలు ఇటు సినీ పెద్దలు మండిపడుతున్నారు. తాజాగా సినీ నటుడు మహేశ్ బాబు ప్రియాంక రెడ్డికి జరిగిన అన్యాయంపై తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ఓ కవిత రూపంలో ఆవేదన వ్యక్తం చేసిన మహేశ్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఓ విజ్ఞప్తి చేశారు. “రోజులు మారుతున్నాయి, నెలలు మారుతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్న సమాజంలో మాత్రం పరిస్థితులు మారడం లేదు. మానవ విలువలను సాధించడంలో విఫలం అవుతున్నా”మని అన్నారు. “ప్రభుత్వాలకు నా చిన్న విన్నపం. ఇలాంటి భయంకరమైన నేరాల చేసిన వారిని తక్షణం శిక్షించాలి. భయంకరమైన నేరాలను అరికట్టడానికి మరిన్ని కఠిన చట్టాలు తీసుకోరావాలి. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. అందరం కలిసి మహిళలకు అండగా నిలుద్దాం , దేశాన్ని సురక్షితంగా మార్చుదాం ” అని అన్నారు. అయన ఈ పోస్టులో ప్రత్యేకంగా పీఎంవో, మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్‌ చేశారు.

Tags:doctor priyanka reddyktr

Leave a Response