సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ తాజాగా కార్తికేయ హీరోగా నటించిన ’90ఎంఎల్’ సినిమాకు సంగీతం అందించాడు. శేఖర్‌రెడ్డి యెర్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 5న వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ “డైరెక్టర్ శేఖర్‌రెడ్డి చెప్పిన కథ ’90ఎంఎల్’ విన్నప్పుడు 90ఎంఎల్ తీసుకున్నంత కిక్ ఇచ్చింది.’90ఎంఎల్’ అనేది మాస్ ఎంటర్‌టైనర్. డైరెక్టర్ స్టోరీ చెప్పినప్పుడు ఎగ్జైట్ అయ్యాను. నెక్స్ట్ సీన్ ఏమిటనేది నా అంచనాలకు అందకుండా చెప్పాడు. ఆరోగ్యపరంగా తనకు ఉండే ఒక సమస్యను హీరో ఎమోషన్స్‌తో ఎలా డీల్ చేశాడన్నదే స్టోరీ లైన్. మ్యూజిక్‌కు మంచి స్కోప్ ఉన్న కథ. ఈ మూవీలో 6 సాంగ్స్, ఒక బిట్ సాంగ్ ఉంది. ఈ మూవీలో కార్తికేయను వేరే లెవల్లో చూస్తారు. ఇందులో అతను నాకు కొత్తగా కనిపించాడు. అతనిలో మంచి హ్యూమర్ ఉంది. ఇప్పటిదాకా ఆ యాంగిల్ సినిమాల్లో రాలేదు. కార్తికేయ అలా డాన్స్ చేస్తాడని ఎవరూ ఎక్స్‌పెక్ట్ చెయ్యరు. అలా చేశాడు. ఇది అతని ఫ్యాన్స్‌కూ, ఆడియెన్స్‌కూ ఒక సర్‌ప్రైజ్ ఎలిమెంట్” అని అన్నారు.