‘ఇంటిగుట్టు’ ‘అల వైకుంఠపురములో’ రెండు ఒకటే…

అల్లు అర్జున్ కధానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నా తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టారు. ఈ సినిమా పాటలు ఇప్పటికే సూపర్ హిట్ గా నిలిచాయి. కొత్తగా ఈ సినిమాపై గుసగుసలు వినిపిస్తున్నాయి. అలనాటి సూపర్ స్టార్ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ సినిమా ‘ఇంటిగుట్టు’కు ఈ సినిమాకు పోలికలు ఉన్నాయని సమాచారం. మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాని ఏవిదంగా తీశారు అనేది సంక్రాంతి వరుకు వేచి చూడాలి. ఒకవేళ అదే కథ అయితే నేటి తరానికి దగ్గరగా ఏలా చేరువ చేసి హిట్ కొడతారో చూడాలి. దీనిలో నిజమెంత అన్నది సినిమా విడుదలైతే గాని తెలియదు. ఈ సినిమాకి తమన్ అందించిన మ్యూజిక్ ప్లస్ అనే చెప్పుకోవాలి. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా పూజ హెగ్డే మెరవనున్నది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.

Tags:ala vaikuntapuramlo

Leave a Response