నయనతార తన ప్రియుడితో కొత్త సినిమా..?

తన నటనతో ప్రజలను ఆకట్టుకున్న నటి నయనతార అని చెప్పవచ్చు ఈమె కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ చేసేది. నయన్‌ను చూసిన మలయాళీ డైరెక్టర్ సత్యన్ అంతిక్కాడ్ ‘మనస్సినక్కరే’ అనే సినిమాలో హీరోయిన్‌గా ఆమెకు తొలి ఛాన్స్ ఇచ్చాడు. ముందు సినిమాల్లోకి వెళ్లద్దనుకున్నా కేవలం ఒక్క సినిమాలో చేద్దామనుకొని కెరీర్ ప్రారంభించింది నయనతార. ఆ తర్వాత ‘విస్మయతుంబట్టు’, ‘తస్కర వీరన్’, ‘రాప్పకల్’ వంటి సినిమాల్లో మోహన్‌లాల్, మమ్ముట్టి వంటి పెద్ద హీరోలతో చేసింది.తర్వాత తమిళంలో ‘అయ్య’, ‘చంద్రముఖి’, ‘గజిని’ వంటి సినిమాల్లో నటించింది. తెలుగులో చేసిన ‘లక్ష్మీ’, ‘బాస్’ చిత్రాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. 2006లో రిలీజైన ‘ఈ’, ‘వల్లభ’ సినిమాలు కుర్రకారులో ఆమెకు మంచి క్రేజ్ తీసుకొచ్చాయి. తర్వాత అజిత్‌తో కలిసి చేసిన ‘బిల్లా’ సినిమా ఆమెకు సెక్సీయెస్ట్ హీరోయిన్‌గా పేరు తెచ్చిపెట్టింది. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది నయన్.. బాపు చిత్రం ‘శ్రీరామరాజ్యం’లో సీతగా నటించి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఈ సినిమాకు గాను ‘ఫిల్మ్‌ఫేర్’, ‘నంది’ అవార్డులు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. ఇప్పుడు నయనతార చాలా మందికి రోల్ మోడల్ అని చెప్పవచ్చు. ఇది ఎలా ఉండగా

తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో అగ్ర సినీ నటి నయనతార ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. గతంలో శివన్ దర్శకత్వంలో నయన్ ‘నేనూ రౌడీనే’ అనే చిత్రాన్ని చేసింది. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో మరో చిత్రం రాబోతోంది. నయనతార హీరోయిన్ గా నటించనున్న ఈ చిత్రానికి శివన్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ‘అవళ్’ ఫేమ్ మిళింద్ రావు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. వచ్చే నెలలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళుతుందని కోలీవుడ్ టాక్. ప్రస్తుతం ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంపిక జరుగుతోందట. టాలీవుడ్ విషయానికి వస్తే, ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార నటించింది. ఈ సినిమా అక్టోబర్ 2 న విడుదల కానుంది.

Leave a Response