నేను పెళ్లి చేసుకుంటే వాళ్ళు హర్ట్ అవుతారు..?ప్రభాస్

దేశవ్యాప్తంగా ప్రభాస్ కి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మాస్ ఆడియన్స్ లో ఆయనకి వున్న ఇమేజ్ మరింత ఎక్కువ.ఇక ఆయనని ఆరాధించే మహిళాభిమానులు కూడా ఎక్కువే. ప్రభాస్ పెళ్లి మేటర్ వస్తే చాలు అందరూ టీవీలకు, ఫోన్లకు అతుక్కుపోతున్నారు. పబ్జి గేమ్ కన్నా ఇంట్రెస్టింగ్ గా చూస్తారు . ఇప్పటికీ ప్రభాస్ ఏ ఇంటర్వ్యూకి వెళ్లిన మొదట అడిగే ప్రశ్న ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు. ఆయన ప్రతీసారి ఒకే సమాధానం ఇప్పుడు ప్రభాస్ తాజా ఇంటర్వ్యూ లో కొత్త స్టైల్ లో సమాధానం చెప్పాడు.

“ఎక్కడికి వెళ్లినా నా పెళ్లి గురించే మాట్లాడుతున్నారు. పెళ్లి అనేది ప్రేమలో ఒక భాగమనేది నా ఉద్దేశం. నా పెళ్లి విషయం కొంతమంది అభిమానులకు ఆనందాన్ని కలిగించవచ్చు .. లేడీ ఫ్యాన్స్ మాత్రం హర్ట్ అవుతారు” అంటూ నవ్వేశాడు. “తెరపై ముద్దు సన్నివేశాల్లో నటించవలసి వచ్చినప్పుడు నాకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది” అంటూ ఆయన మరో ప్రశ్నకి సమాధానంగా చెప్పాడు. ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా ఈ నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు … తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమా సందడి చేయనుంది.

Leave a Response