తాజాగా శ్రుతి శర్మను కథానాయికగా..?

నిఖిల్ సినిమాలంటే యూత్ చాలా ఇష్టపడతారు. కొత్త కథలతో ఎప్పుడు యంగ్ గా కనిపిస్తూ, తన యాక్షన్ తో తనకంటూ ప్రత్యేకమైన పేరును సంపాదించుకున్నాడు. తెలుగులో 12 సినిమాలకు పైగా తీసాడు. ఇతని మొదటి సినిమా ”హ్యాపీ డేస్” ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్రహీత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో గల నలుగురు స్నేహితులలో ఒకనిగా నిఖిల్ నటించాడు. ఈ చిత్రం విజయంతో నిఖిల్ యొక్క కీర్తి పెరిగింది. 2007 లో అతి తక్కువ బడ్జెట్ తో తీసి కమర్షియల్ హిట్ అయిన చిత్రంగా హ్యాపీడేస్ చిత్రం నిలిచింది. అతని మొదటి సోలో చిత్రం అంకిత్,పల్లవి& ఫ్రెండ్స్. యువత మరియు వీడు తేడా చిత్రాలలో నటించాడు. అవి 50 రోజులు ఆంధ్రప్రదేశ్ లో ఆడాయి.ఇక విషయానికి వెళ్తే

చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ కథానాయకుడిగా కొంతకాలం క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కార్తికేయ’, భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి చందూ – నిఖిల్ రంగంలోకి దిగారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పనులతో ఇద్దరూ బిజీగా వున్నారు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కొంతమంది పేర్లను పరిశీలించారు.తాజాగా శ్రుతి శర్మను కథానాయికగా ఎంపిక చేసుకున్నారు. ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ సినిమా ద్వారా తెలుగు తెరకి శ్రుతి శర్మ పరిచయమైంది. ఆ సినిమా సక్సెస్ తరువాత ఆమెకి లభించిన అవకాశం ఇదే. ఈ సినిమాలో ఆమె జర్నలిస్ట్ గా హీరోయిన్ పాత్రలో కనిపించనుందని సమాచారం. ఆకర్షణీయమైన కళ్లతో తొలి సినిమాతోనే యూత్ హృదయాలను దోచేసిన ఈ అమ్మాయి, మొత్తానికి మంచి ఛాన్సే కొట్టేసింది.

Leave a Response