ఒక సైనికుడిగా చనిపోయి, ఇంకా ఆత్మగా కాపలా కాస్తున్నాడు..?

ప్రతీ ఒక్కరు తెలుసుకోవలసినది తర్వాతతరానికి తెలియజేయాలసింది ”చరిత్ర” . ఒక మంచి పుస్తకం చదివేకొద్దీ చదవాలనిపిస్తుంది. ఒక మంచి కథ వినేకొద్దీ వినాలనిపిస్తుంది. అలాంటి కథ ఆ పుస్తకం మన చరిత్ర అయితే మనం నేర్చుకుంది ఎంతో జ్ఞానం, విజ్ఞానం . మన ప్రతీ ప్రశ్నకు జవాబు మనచరిత్రలోనే దొరుకుతుంది. అందుకోసం మీకోసం సినీస్టార్స్ గురించి కాదు, రియల్ స్టార్స్ గురించి రాస్తున్న.ఈ రోజు మన బాబా హర్భజన్ సింగ్ . బాబా అన్నానని ఏ బురిడీ బాబానో అని అనుకోకండి. ఎందుకంటే మనకు కనిపించే దేవుడు ఒక భారతీయ సైనికుడు. ఏ సైనికుడైనా దేశం కోసం చనిపోయి తృప్తి పడతాడు. కానీ ఈ బాబా హర్భజన్ సింగ్ గారికి దేశం కోసం చనిపోయాక కూడా తృప్తి లేదనుకుంట అందుకే బహుశా ఒక ఆత్మలాగ కూడా మన దేశానికి కాపలాకాస్తున్నాడు. ఇక విషయానికి వెళ్తే

30 ఆగస్ట్ 1946 న ఒక మహానుభావుడు జన్మించాడు. ఆయనే హర్భజన్ సింగ్ ఈయన ప్రస్తుత పాకిస్థాన్ లోని పంజాబ్ లో జన్మించారు. 1965 మార్చ్ లో ఇండియన్ ఆర్మీలో చేరారు. కానీ పోస్టింగ్ మాత్రం సిక్కింలో పడింది. భరత్, చైనా సరిహద్దుల్లో విధులను నిర్వహించేవారు. కానీ అనుకోకుండా ఒక రోజు మంచు తుఫాన్ లో చిక్కుకున్నారు. సముద్రమట్టానికి 14500 ల అడుగుల ఎత్తునుంచి కాలు జారీ పడ్డారు. 1967 సెప్టెంబర్ 11 న హర్భజన్ తన చివరి శ్వాస విడిచారు. అప్పటికి ఆయన వయసు కేవలం 22 ఏళ్లు అతని శవాన్ని వెతకడానికి సైనికులు చాలా రోజులు ప్రయత్నించారు. కానీ లాభం లేకపోయింది. ఇక్కడినుంచే ఒక అద్భుతం జరిగింది. ఒక రోజు హర్భజన్ తన సహచరుని కలలో కనిపించి తన ఆచూకీ చెప్పాడు. ఎంత వెతికిన దొరకని హర్భజన్ శవం కలలో కనిపించి చెప్పిన ప్రదేశంలో కనిపించింది. ఒక్కసారిగా అందరూ షాక్ కి గురైయ్యారు. ఇక అతని అంత్యక్రియలు పూర్తి చేసారు. మళ్ళీ తన సహచరుని కలలోకి వెళ్లి నా శరీరం మాత్రమే కాలి భూడిదయింది. కానీ నా ఆత్మ దేశసేవలోనే ఉంటుందని చెప్పాడు. ఆ విషయాన్ని అందరూ మరచిపోయారు.కాని కొన్నినాలకే ఈ విషయం నమ్మవల్సి వచ్చింది. ఏదయినా ప్రమాదం ముంచుకొస్తున్న, శత్రువులు యుద్ధానికి వస్తున్న హర్భజన్ కల్లోకివచ్చి ముందుగానే తెలియజేసేవాడు. తర్వాత తాను చెప్పినట్టుగానే అంతా జరిగేది. ఈ విషయం క్రమంగా అధికారుల చెవిన పడింది. కానీ వాళ్ళు మొదట నమ్మలేదు పరీక్షించిచూసి ఆర్చిర్యపోయారు. దీనికి కారణం మీ సైనికుడు తెల్ల దుస్తులు ధరించి ఒక గుర్రం ఫై స్వారీ చేస్తున్నాడని, మీ సైనికుడిని వెనక్కి పిలిపించుకొండి అంటూ చాలా సార్లు చెప్పారంట అంతే కాకుండా దీనిపై చైనా వాళ్ళు భారత్ కి లేఖకూడా రాశారంట. దీని గురించి కూడా హర్భజన్ సైనికుల కలలో కనిపించి చెప్పడంట దీనితో అధికారులకు హర్భజన్ ఫై ఆత్మవిశ్వాసం పెరిగిందట అందుకోసమే ఆయన మీద నమ్మకంతో బాబా హర్భజన్ కు ఒక మందిరం కూడా కట్టించారు సైనికులు ఒక ఆర్మీ సైనికుడికి పొద్దునుంచి, సాయంత్రం వరకు జరగవలసిన పనుల్లోనూ, ప్రతి కార్యక్రమం లోను హర్భజన్ పాల్గొంటారు. ఈయన చేసే మంచి పనులకు గాను ప్రజలు బాబా ను భక్తితో కొలుస్తారు. నైట్ ఈయన డ్యూటీ లో ఉంటారని. ప్రజల కోరికలను పగటివేళ తీరుస్తారని ప్రజల నమ్మకం చనిపోయి మన కోసం ఇంత చేస్తున్న బాబా హర్భజన్ సింగ్ కు ఒక్క సెల్యూట్ ఎందుకంటే ఆగస్ట్ 30 న ఈయన పుట్టిన రోజు ఒక్క క్షణం గుర్తుకు తెచ్చుకోండి. జై హింద్

Leave a Response