‘అద్భుతం.. అత్యద్భుతం’

That's awesome ..

వెస్టిండీస్ ఇచ్చిన 208 పరుగుల లక్ష్య సాధనలో తనదైన శైలిలో మెరిపించిన విరాట్ కోహ్లీని ప్రశంసలు ముంచెత్తుతున్నాయి. టీ 20లో అసాధ్యమనుకున్న 208 పరుగుల లక్ష్య సాధనలో 94 పరుగులతో కీలక పాత్ర పోషించాడు విరాట్. ప్రారంభంలో అభిమానులను భయపెట్టినప్పటికీ 8 బంతులు మిగిలి ఉండగానే భారత్ ఆటను పూర్తి చేశాడు. విరాట్ కు టీ20లో వ్యక్తిగతంగా కూడా అత్యధిక స్కోర్ కూడా ఇది. విరాట్ అజేయమైన బ్యాటింగ్ శైలికి ముగ్ధుడైన మాజీ ప్రపంచ ప్రసిద్ధ క్రికెటర్ రిచర్డ్స్ ‘అద్భుతం.. అత్యద్భుతం’ అంటూ ట్వీట్ చేశారు. దానితో పొంగిపోయిన విరాట్ ‘థాంక్యూ బిగ్ బాస్. మీ ప్రశంసలు వెలకట్టలేనివి’ అంటూ రిప్లై ఇచ్చాడు. అశ్విన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, భజ్జీ, కుల్ దీప్ యాదవ్, వీరూ తదితరులు విరాట్ ను పొగడ్తలతో ఆకాశానికెత్తేశారు. విరాట్ తిరిగి బౌన్స్ బ్యాక్ వలన అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:

Leave a Response