శివమ్‌ దూబే అరంగేట్రం..!

Shivam Dubey debuts

అరుణ్‌ జైట్లీ స్టేడియంలో భారత్‌, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య ఆదివారం తొలి టీ20కి రంగం సిద్ధమైంది.దీపావళి తర్వాత వాయు కాలుష్యం విపరీతంగా ఉండడంతో ఇక్కడ ఆడించడంపై చాలా విమర్శలు వచ్చినా బీసీసీఐ మాత్రం మ్యాచ్‌ నిర్వహణకే మొగ్గు చూపింది. అయితే ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేయకపోవడంతో ఈ పోరుకు ఎలాంటి ఆటంకం లేకపోయింది. ఇక చాన్స్‌ కోసం ఎదురుచూస్తున్న భారత యువ ఆటగాళ్లు చెలరేగాలని భావిస్తుండగా సీనియర్లు తమ సత్తా చాటాలనుకుంటున్నారు. బౌలింగ్‌ విభాగంలో స్టార్లు లేకపోయినా యువ ఆటగాళ్లు శివమ్‌ దూబే, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌ భవిష్యత్‌ తారలుగా నిలవాలనుకుంటున్నారు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌ ముందు ఇంకా 20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా ఎలాంటి అయోమయం లేకుండా ముందే తమ కోర్‌ గ్రూప్‌ను సిద్ధం చేసుకోవాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ యోచిస్తోంది. ప్రపంచక్‌పలో గాయపడిన రోహిత్ దక్షిణాఫ్రికాతో టీ20 సిరీ్‌సలో 36, 40 పరుగులు చేశాడు. ఆ తర్వాత విజయ్‌ హజారే టోర్నీలో ఆకట్టుకోలేకపోయాడు. ఏడు మ్యాచ్‌ల్లో ఒక్క అర్ధసెంచరీ మాత్రమే చేశాడు. ఇక మిడిలార్డర్‌లో రాహుల్‌, శ్రేయాస్‌, క్రునాల్‌, రిషభ్‌ పంత్‌ మెరుపులు మెరిపించాలని ఉవ్విళ్లూరుతున్నారు. మరోవైపు భారీ షాట్లు ఆడగల నైపుణ్యం కలిగిన శివమ్‌ దూబే అరంగేట్రం కూడా ఖాయంగానే కనిపిస్తోంది. అదే జరిగితే మనీశ్‌ పాండే, సంజూ శాంసన్‌లకు చోటు దక్కడం కష్టమే. ఎందుకంటే మిగిలిన స్థానాలు చాహల్‌, ఖలీల్‌, దీపక్‌, వాషింగ్టన్‌ సుందర్‌లతో భర్తీ అవుతాయి.

Tags:pollutionshivam dubey

Leave a Response