శివమ్‌ దూబే లైఫ్ స్టోరీ..!

Shivam Dubey Life Story ..!

ఆరేళ్ల వయస్సులో దూబేలో క్రికెట్‌ నైపుణ్యాలను గుర్తించిన శివమ్‌ తండ్రి రాజేష్‌ వ్యాపారి.దూబే క్రికెట్‌ కెరీర్‌కు తన వ్యాపారం అడ్డువస్తుండడంతో రాజేష్‌ దానిని ఆపేశాడు. 14 ఏళ్ల వయస్సులో అతడు బాగా లావుగా ఉండడంతో బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేయడంలో ఇబ్బంది పడేవాడు. దీంతో స్కూల్‌ క్రికెట్‌ కోచ్‌ నీలేష్‌ భోసాలే సూచనతో 10 కిలోలు తగ్గాడు. ఆ తర్వాత అతడు బాగా రాణించడం ప్రారంభించాడు. అయితే, కుటుంబ ఆర్థిక కారణాలతో 15 నుంచి 20 ఏళ్ల వయస్సు వరకు దూబే క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. పునరాగమనంలో ఆల్‌రౌండర్‌గా సత్తా నిరూపించుకున్న శివమ్‌.. 2015-16 సీజన్‌లో ముంబై తరపున సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీతో టీ20లలో అరంగేట్రం చేశాడు. ఐపీఎల్‌ ఎన్నో పాఠాలు నేర్పింది. ముఖ్యంగా విఫలమైన సమయాల్లో ఆట తీరును మార్చుకొని తిరిగి ఎలా రాణించాలో ఆ టోర్నీ ద్వారా తెలుసుకున్నా. అలాగే అంతర్జాతీయ క్రికెటర్లతో ఆడడం వల్ల మరిన్ని మెళకువలు నేర్చుకున్నా. ఇండియా-ఎ జట్టు సభ్యుడిగా రాహుల్‌ ద్రావిడ్‌తో సమయం గడపడం గొప్ప అనుభూతి. లక్ష్య ఛేదనలో శివాజీ పార్క్‌ లయన్స్‌ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ శివమ్‌ దూబే శివాలెత్తాడు. లెగ్‌స్పిన్నర్‌ ప్రవీణ్‌ తాంబే బౌలింగ్‌లో వరుసగా ఐదు సిక్సర్లు కొట్టి దుమ్మురేపాడు. దాంతో 170 పరుగుల లక్ష్యాన్ని శివాజీ పార్క్‌ ఇంకా రెండో ఓవర్లు ఉండగానే ఛేదించింది. అలాగే ఆ ఏడాది డీవై పాటిల్‌ టీ20 టోర్నీ ఫైనల్లో వాయువేగంతో ఆడిన దూబే 34 రన్స్‌ చేయడంతోపాటు అద్భుత బౌలింగ్‌తో ఏడు పరుగులకు మూడు వికెట్లు పడగొట్టి ఆల్‌రౌండ్‌ నైపుణ్యాన్ని చాటాడు. దాంతో బీపీసీఎల్‌ జట్టు టైటిల్‌ చేజిక్కించుకుంది. అలా తొలిసారి శివమ్‌ దేశ క్రికెట్‌ దృష్టిని ఆకర్షించాడు. అదే సంవత్సరం డిసెంబరులో బరోడాపై రంజీట్రోఫీ మ్యాచ్‌లో తన సిక్సర్ల పవరేంటో దూబే మరోసారి చూపాడు.ఐపీఎల్‌ వేలంలో రాయల్‌ చాలెంజర్స్‌ ఫ్రాంచైజీ అతడిని ఏకంగా రూ. ఐదు కోట్లకు కొనుగోలు చేసింది. కానీ గత ఐపీఎల్‌లో బెంగళూరు ఆడిన 14 మ్యాచ్‌ల్లో శిమ్‌కు కేవలం నాలుగింటిలోనే ఆడే చాన్స్‌ లభించింది. వాటిల్లో 121 స్ట్రయిక్‌ రేట్‌తో 40 రన్స్‌ చేశాడు. వికెట్లు మాత్రం తీయలేకపోయాడు. అయితే తదుపరి వెస్టిండీస్‌లో ఇండియా-ఎ పర్యటనలో దూబే అమోఘంగా రాణించాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో రెండు హాఫ్‌ సెంచరీలతో ఆకట్టుకున్నాడు. మొదటి నాలుగు రోజుల మ్యాచ్‌లో ఇండియా-ఎ టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు.

Tags:shivam dubey

Leave a Response