ఆదిలోనే దెబ్బకొట్టిన ఉమేశ్ యాదవ్

ఈ ఉదయం ఇండోర్ లో భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ మొదలు కాగా, టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ జట్టును సీమర్ ఉమేశ్ యాదవ్ ఆదిలోనే దెబ్బకొట్టాడు. మ్యాచ్ ప్రారంభం నుంచి పరుగులు చేసేందుకు బంగ్లా ఆటగాళ్లు ఇబ్బందులు పడుతుండగా, ఆరవ ఓవర్ ను వేసిన ఉమేశ్ ఓపెనర్ ఇమ్రుల్ కయీస్ ను పెవిలియన్ కు పంపాడు. 18 బంతులాడిన కమీస్, రహానేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం దీంతో బంగ్లాదేశ్ తొలి వికెట్ ను కోల్పోయింది. ప్రస్తుతం బంగ్లా తొలి ఇన్నింగ్స్ స్కోరు 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 12 పరుగులు.

Leave a Response