ఒకే రకం కిక్ ను పదివేల సార్లు ప్రాక్టీస్ చేసిన వ్యక్తికి భయపడతా..

మార్షల్ ఆర్ట్స్ లెజెండ్ బ్రూస్ లీ వీరాభిమానిగా చెప్పుకుంటున్న టాలీవుడ్ సీనియర్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా బ్రూస్ లీకి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా బ్రూస్ లీ చెప్పిన ఓ కొటేషన్ ను ఉటంకించారు. ‘నేను 10వేల రకాల కిక్స్ ను ప్రాక్టీస్ చేసిన ఒక వ్యక్తికి భయపడను. ఒకే రకం కిక్ ను పదివేల సార్లు ప్రాక్టీస్ చేసిన వ్యక్తికి భయపడతాను’ అన్న బ్రూస్ లీ వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. వర్మ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఎంటర్ ద గర్ల్ డ్రాగన్ సినిమాను అభిమానుల ముందుకు తెస్తున్న నేపథ్యంలో ఈ పోస్టింగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

Image result for ram gopal varma

Leave a Response