ఇస్టాగ్రమ్ లో బహుబలి…. ప్రభాస్

యంగ్‌ స్టార్ ప్రభాస్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచారు. తన ఖాతాలో ఇంకా ప్రొఫైల్‌ ఫొటో కానీ, వివరాలు కానీ పోస్ట్‌ చేయలేదు. అధికారికంగా ప్రకటించకపోయినా, ఆయన ఖాతాకు ఏడు లక్షలకు చేరువలో ఫాలోవర్లు ఉండటం విశేషం.ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ పోస్ట్‌ పెట్టలేదు కూడా. కేవలం ఖాతాకు యాక్టర్‌ ప్రభాస్‌ అన్న పేరు మాత్రమే పెట్టుకున్నారు. ఆ ఒక్క పేరు చూసి ఇంత మంది అభిమానులు ఖాతాను అనుసరించడం మొదలుపెట్టారంటే ‘బాహుబలి’కి ఉన్న ఫాలోయింగ్‌ ఎంతో అర్థమవుతోంది.

Leave a Response