టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో.. కలిసి ఓ సినిమాను అభిమానుల ముందుకు తేవాలనుకుంటున్నాడు.. తరువాత సుకుమార్, వేణు శ్రీరామ్‌తో కలిసి పనిచేయనున్నాడు. త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమా షూటింగ్ ఈ నెల 24నుంచి ప్రారంభం కానుంది. ఈలోపే మ్యూజిక్ సిట్టింగ్‌కు స్టార్ట్ చేశారని తెలుస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందించగా.. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని సమకూరుస్తున్నారు. త్రివిక్రమ్, సిరివెన్నెలతో కలిసి ఉన్న ఫోటోను థమన్ షేర్ చేశారు. ఈ చిత్రంలో బన్నీకి సరసన పూజ నటించనుంది.