మోదీని చూసి వణుకుతన్న బీజేపీ మహిళా నేతలు!

. రాజస్థాన్‌లోని అల్వార్‌లో దళిత మహిళపై ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడడాన్ని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించకపోవడంతో మాయావతి నిప్పులు చెరుగుతున్నారు. ప్రధాని మోదీని చూసి బీజేపీ మహిళా నేతలు వణుకుతున్నారని ఆమె పేర్కొన్నారు. మోదీ వద్ద తమ భర్తలు ఉన్న సమయంలో బీజేపీ మహిళా నేతలు భయపడుతున్నారని చెప్పారు. ఎందుకంటే మోదీ తన భార్యను దూరం చేసుకున్నట్లు, తమను తమ భర్తల నుంచి దూరం చేస్తాడేమోనని మహిళా నేతలు భయపడుతున్నారని మాయావతి పేర్కొన్నారు. దళిత మహిళకు జరిగిన అన్యాయంపై స్పందించని మోదీ.. పార్టీలోని మహిళా నేతలకు ఎలా గౌరవం ఇస్తారని మాయావతి ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం పనికిమాలిన రాజకీయాలు చేస్తుందని ఆమె ధ్వజమెత్తారు. రాజకీయాల్లో లబ్ధి పొందేందుకే అల్వార్ ఘటనపై మోదీ స్పందించడం లేదని మాయావతి పేర్కొన్నారు.

 

Leave a Response