దర్శకుడికి ముద్దు పెట్టిన మహేష్..?

‘మహర్షి’ సినిమా సూపర్ హిట్ కావడంతో సంబరాలు చేసుకుంటున్నారు సినిమా యూనిట్, తనకు ఇంతటి హిట్ ను ఇచ్చిన దర్శకుడు వంశీ పైడిపల్లి బుగ్గపై ముద్దివ్వగా, ఆ ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఇక మహేశ్ తనకు ముద్దు పెడుతుండగా, సెల్ఫీ తీసుకున్న వంశీ, దీనికి “ఇదే నా జీవితంలో బెస్ట్‌ మూమెంట్‌. ఇంతకంటే ఇంకేం అడగగలను” అని క్యాప్షన్‌ పెట్టాడు. ఇక ఈ సినిమాలో చూపిన ‘వీకెండ్‌ వ్యవసాయం’ కాన్సెప్ట్‌ ఎంతో మందిని ఆ దిశగా నడిపిస్తుండగా, యువత, ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు వారాంతంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమై, ఆ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మిత్రులతో పంచుకుంటున్నారు.

Leave a Response