ప్రేమలో పడ్డారా..?

టాలీవుడ్ అమ్మడు అనుపమ పరమేశ్వరన్ ఒక భారతీయ నటి. ఈమె తెలుగు, మలయాళ, తమిళ సినిమాలలో నటించింది. ఈమె నటించిన తొలి మలయాళ చిత్రం ప్రేమమ్‌లోని మేరీ జార్జ్, తెలుగు సినిమా శతమానం భవతిలో నిత్య ప్రాత్రలు ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి ఈమె మలయాళ సినిమా ప్రేమమ్‌ సినిమాలో నివిన్ పౌలీతో కలిసి నటించడం ద్వారా సినిమా రంగ ప్రవేశం చేసింది. ఈ సినిమా వాణిజ్యపరంగా విజయాన్ని సాధించింది. తరువాత ఈమెకు మలయాళ చిత్రం జేమ్స్ & అలైస్ లో అవకాశం చిక్కింది. తరువాత ఆమెకు వరుసగా తెలుగు సినిమాలలో అవకాశాలు తన్నుకు వచ్చాయి. వాటిలో సమంత, నితిన్ నాయికా నాయకులుగా నటించిన అ ఆ వంటి సినిమాలు ఉన్నాయి.ఈమె మాతృభాష మలయాళమైనా తొలి తెలుగు సినిమా అ ఆలో స్వంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. తరువాత ఈమె మలయాళం నుండి తెలుగులోనికి పునర్మించబడిన ప్రేమమ్ సినిమాలో నాగ చైతన్య సరసన నటించింది. అటు పిమ్మట ఈమె ధనుష్ హీరోగా వెలువడిన తమిళ సినిమా “కోడి”లో నటించింది ఇవి కాకుండా సాయి ధరమ్ తేజ్ సరసన క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై వెలువడనున్న ఇంకా పేరు పెట్టని సినిమాలో నటించడానికి ఒప్పందం కుదుర్చుకుంది అమ్మడు ప్రస్తుతం .జాతీయ క్రికెట‌ర్ జ‌స్ర్పీత్ బుమ్రా తో ఈ అమ్మడు ప్రేమలో ఉన్నటు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం సోష‌ల్ మీడియాలోనే కాదు.. జాతీయ మీడియాలో సైతం ఇదే విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వీరిద్ద‌రూ ఇప్ప‌టివ‌ర‌కు క‌లిసి బ‌య‌ట క‌నిపించ‌లేదు. పార్టీలకు, ప‌బ్‌ల‌కు క‌లిసి తిర‌గ‌లేదు. అయినా వీరిద్ద‌రి గురించి ఇలాంటి వార్త రావ‌డానికి కార‌ణం సోష‌ల్ మీడియా. అవును.. సోష‌ల్ మీడియాలో వీరిద్ద‌రూ ఒక‌ర్నొక‌రు ఫాలో అవుతున్నారు. బుమ్రా ఫాలో అవుతున్న ఏకైక సినిమా న‌టి అనుప‌మే. అంతేకాదు ఒక‌రు పెట్టే పోస్ట్‌కు మ‌రొక‌రు వెంట‌నే లైక్‌లు కొట్ట‌డం, ఒక‌రి పోస్ట్‌ల‌ను మ‌రొక‌రు షేర్ చేయ‌డం త‌ర‌చుగా చేస్తున్నార‌ట‌. దీంతో నెటిజ‌న్లు వీరి గురించి చ‌ర్చ‌ను షురూ చేశారు. జాతీయ మీడియా సైతం వీరి వ్య‌వ‌హారంపై ఓ లుక్కేసింది. దీంతో వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన అనుప‌మ‌.. బుమ్రా త‌న‌కు మంచి స్నేహితుడు మాత్ర‌మేనని ఇటీవ‌ల ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చింది. అయిన‌ప్ప‌టికీ వీరిద్ద‌రికీ స్నేహం ఎలా కుదిరిందబ్బా అంటూ సోష‌ల్ మీడియాలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

Related image

Leave a Response