ఉపాది హమీ పథకంలో అవినీతి

శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం నందు ఉపాది హమీ పథకంలో అవినీతిని అరికట్టాలని,ఉపాది హమీ పథకం కూలీలకు రావల్సిన కూలీలను ఇవ్వాలని డిమాండు చేస్తూ తొట్టంబేడు మండల కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు దర్నా నిర్వహించడం జరిగింది. ఈసంధర్బంగా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ…! తొట్టంబేడు మండలంలో ఉపాది హమీ పథకం క్రింద పనులు చేయించుకున్న అధికారులు కూలీలకు ఇవ్వాల్సిన కూలీలను గత 6నెలలుగా ఇవ్యడం లేదని ఆరోపించారు. గ్రామంలో ప్రతి ఒక్కరికి 100రోజులు పని కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్శకంగా చేపట్టిన జాతీయ గ్రామీణ హమీ పథకానికీ ఇక్కడి అధికారులు తూట్లు పోడుస్తున్నారని ఆరోపించారు.
జనవరిలో ప్రభుత్వం 400కోట్లను ఉపాది హమీ పథకానికి నిధులు విడుదల చేసినప్పటికి కూలీలకు రావాల్సిన బకాయిలు ఎందుకు చెల్లించలేదని దీనికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకొవాలని వారు డిమాండు చేశారు. ఈకార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు జనమాలగురవయ్య,శివయ్య, ధర్మయ్య,రామయ్య,శాంతి, సుప్రజ తదితరులు పాల్గొన్నారు.

Leave a Response