గురు, శుక్రవారాల్లో ఈ టీవీ లో ప్రచారం అవుతున్న షో జబర్దస్త్.. ఈ షో తెలుగు అభిమానులను కట్టిపడేసింది. కామెడీ కొంచం వల్గర్ అయినా… జనాన్ని మాత్రం ఆకట్టుకుందనే చెప్పొచ్చు. ఈ షో ఇంతలా ఆకట్టుకుందంటే…కంటెస్టెంట్‌తో పాటు జడ్డిలుగా ఉన్న నాగబాబు-రోజా కూడా ఓ కారణం. అయితే, జబర్ధస్త్ షో డైరెక్టర్లుగా ఉన్న నితిన్-భరత్‌ల విషయంలో యాజమాన్యం వైఖరి నాగబాబుకు నచ్చలేదని తెలుస్తోంది. వారిద్దరిని పంపించి వేసినందను తాను ఇక న్యూ అయ్యేందుకు సముఖంగా లేనని సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొత్త ఎపిసోడ్ షూటింగ్‌లు ఆగిపోయినట్లు జబర్ధస్త్ వర్గాల సమాచారం. అయితే…మరో జడ్జి రోజా కూడా జబర్దస్త్‌కు గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
previous article
రొమాంటిక్ సీన్లలో రొమాంటిక్ సినిమా…
next article
సినిమా షూటింగ్ ఈరోజే మొదలు…