రొమాంటిక్ సీన్లలో రొమాంటిక్ సినిమా…

ఆకాశ్ పూరి హీరోగా ‘రొమాంటిక్’ సినిమా అభిమానుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ నిర్మాణంలో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా అనిల్ పాదూరి .. హీరోయిన్ గా కేతిక శర్మ పరిచయమవుతున్నారు. పూరి కథాకథనాలను అందించిన ఈ సినిమా, కొన్ని రోజులుగా ‘గోవా’లో షూటింగ్ జరుపుకుంటోంది.నిన్నమొన్నటివరకూ అక్కడ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు దర్శకుడు. ప్రస్తుతం అక్కడ నాయకా నాయికల కాంబినేషన్లో ఒక రొమాంటిక్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగ్ యూత్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంటుందని అంటున్నారు చిత్ర యూనిట్. మరో రెండు మూడు రోజుల పాటు ఈ పాటనే చిత్రీకరిస్తారట. మాఫియా నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథలో, రమ్యకృష్ణ కీలకమైన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే.

Image result for akash puri

Leave a Response