బ్రేకప్ గురించి ఇలియానా అభిప్రాయం…

టాలీవుడ్ అందాల సుందరి ఇలియానా ఆస్ట్రేలియా చెందిన ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో కొంతకాలం ప్రేమయాణం సాగించిందన విషయం అందరికి తెలిసిందే. ఆండ్రూను తన భర్తగా కూడా సంబోధించింది. అయితే ఇటీవల వారిద్దరూ విడిపోయారు. ఆండ్రూకు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల నుంచి ఇలియానా తొలగించింది.బ్రేకప్ గురించి మీడియాలో ఎన్ని వార్తలు వస్తున్నా ఇలియానా ఇప్పటివరకు స్పందించలేదు. అయితే తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బ్రేకప్ గురించి ఈ అమ్మడు తొలిసారి స్పందించింది. ప్రేమలో విఫలమైనందుకు నేను బాధపడడం లేదు. అది ఒక్క వ్యక్తికే సంబంధించిన అంశం కాదు. ఇద్దరు వ్యక్తులకు, వారి వ్యక్తిత్వాలకు సంబంధించినది. ఇద్దరిలో ఏ ఒక్క వ్యక్తి తమ బంధం గురించి మాట్లాడినా.. పరోక్షంగా రెండో వ్యక్తి గురించి కూడా మట్లాడినట్టే అవుతుంది. మా బ్రేకప్ గురించి చాలా మంది ట్రోలింగ్ చేస్తున్నారు. నేను అలాంటివి పట్టించుకోను. కానీ, గతంలో నాతో రిలేషన్‌లో ఉన్న వ్యక్తి అలా తీసుకోలేకపోవచ్చని ఇలియానా చెప్పడం విశేషం.

Image result for ileana actress

Leave a Response