మహేష్ బాబు టీజర్ లోడింగ్….

టాలీవుడ్ యాంగ్ హీరో మహేశ్ బాబు, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా అభిమానుల ముందుకు వస్తుంది. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. ఈ సినిమాకి ‘దిల్’ రాజు ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన బ్యానర్ నుంచి, ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ లోడింగ్ అంటూ ఆర్మీ ఆఫీసర్ గా మహేశ్ బాబు ‘గన్’ లోడ్ చేస్తున్న ఒక ‘గిఫీ’ వీడియోను వదిలారు. త్వరలో టీజర్ ను వదలనున్నట్టుగా సంకేతాన్నిచ్చారు. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో, విజయశాంతి .. ప్రకాశ్ రాజ్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు.

Leave a Response