చైతూ హీరోగా శేఖర్ కమ్ముల సినిమా లో హీరోయిన్ ఎవరో తెలుసా..?

టాలీవుడ్ యాంగ్ హీరో నాగచైతన్య వివేక్ కృష్ణ దర్శకత్వంలో అమలాపాల్ కథానాయికగా తెరకెక్కిన బెజవాడ సినిమాలు పరాజయాన్ని చవిచూసాయి.నాగ చైతన్య దేవ కట్ట దర్శకత్వంలో సమంత సరసన ఆటోనగర్ సూర్య, కిషోర్ పార్థాసాని దర్శకత్వంలో సునీల్, తమన్నా, ఆండ్రియా సరసన తడాఖా, విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో మనం, వీరూ పోట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాల్లో నటించాడు. వాటిలో చెప్పుకోదగ్గ చిత్రం ‘మనం’. ఈ చిత్రంలో స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారు నటించడంతో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో కూడా అంచనాలు ఎక్కువయ్యాయి. అయితే, ఈ చిత్రం పూర్తి కాకుండానే, ఎ.ఎన్.ఆర్ చనిపోవడంతో, ‘మనం’ సినిమా అంచనాలకు మించి, బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు సృష్టించింది.ఆ తర్వాత 2014 చివర్లో ‘ఒక లైలా కోసం’తో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.2015 లో సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘దోచేయ్’ అనే సినిమా చేసినప్పటికీ అది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.2016 లో మలయాళం రీమేక్ అయిన ‘ప్రేమమ్’ సినిమాతో మరొక విజయాన్ని అందుకున్నాడు.ఆ వెంటనే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘సాహసమే శ్వాసగా సాగిపో’అనే చిత్రంలో నటించి ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నాడు.2017 లో ‘రారండోయ్ వేడుక చూద్దాం’తో మళ్ళీ ఘన విజయం సాధించింది.2018 లో విడుదల అయిన శైలజా రెడ్డి అల్లు డు విజయం సాదించింది. ఆ తర్వాత చైతూ హీరోగా శేఖర్ కమ్ముల ఒక సినిమా చేయనున్నాడనీ, కథానాయికగా సాయిపల్లవి ఎంపిక జరిగిపోయిందనే టాక్ రెండు మూడు రోజులుగా వినిపిస్తోంది. ఈ వార్త నిజమేననే విషయం తాజాగా స్పష్టమైపోయింది. శేఖర్ కమ్ముల – చైతూ కాంబినేషన్ లోని సినిమా నిజమేనంటూ ఒక ప్రకటన వచ్చేసింది. ఈ సినిమాలో సాయిపల్లవినే ఖరారు చేసేశారు దర్శకుడు.

Image result for naga chaitanya and shekhar kamal

Leave a Response