పవన్ కళ్యాణ్ న్యూ లుక్…

1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంద్వారా పవన్ కళ్యాణ్గా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. గబ్బర్ సింగ్ కుగాను తెలుగులో ఉత్తమ నటునిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకొన్నారు. అత్తారింటికి దారేది చిత్రం వసూళ్ళలో అప్పటి వరకు తెలుగు సినీపరిశ్రమలో ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టినది. అంజనా ప్రొడక్షన్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లతో సినిమాలు నిర్మిస్తాడు. 2015 లో గోపాల గోపాల చిత్రంలో మోడరన్ కృష్ణునిగా నటించారు. 2016లో సర్దార్ గబ్బర్ సింగ్, 2016 ప్రారంభంలో కాటమరాయుడు సినిమాలలో నటించారు. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 25వ చిత్రం ఆజ్ఞతవాసిలో నటించారు .తెలుగు చిత్ర రంగంలోని సమకాలీన కథానాయకులకు, పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానాలకు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ విభిన్న ఆలోచనా ధోరణే పవన్ కళ్యాణ్ కి చిత్రసీమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టింది.ప్రస్తుతానికి టాలీవుడ్ లో మాస్ ఇమేజ్ తో సూపర్ స్టార్ గా ఉన్న తరుణంలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్‌ కల్యాణ్‌, తిరిగి సినిమాలు చేయాలని నిర్ణయించుకోవడం విశేషం. అవుననే అంటున్నారు ఆయన అభిమానులు. గత అసెంబ్లీ ఎన్నికల్లో విఫలమైన పవన్ కల్యాణ్, నిన్నమొన్నటి వరకూ గడ్డంతో, తెల్ల లాల్చీ, పంచెలో కనిపించారన్న సంగతి మన అందరికి తెలిసిందే. తాజాగా ఆయన జీన్స్, టీ షర్ట్స్ లోకి వచ్చేశారు. గడ్డాన్ని ట్రిమ్ చేశారు. పవన్ తాజా చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఆయన నూతన లుక్ అభిమానులను అలరిస్తోంది. వెండితెరపై రీ ఎంట్రీకి తమ హీరో సిద్ధమయ్యాడని, త్వరలోనే సినిమాల్లో కనిపించడం పక్కా అని అంటున్నారు పవన్ ఫ్యాన్స్. ఈ విషయంలో పవన్ ఇంకా తన మనసులోని మాటను వెల్లడించక పోవడం గమనార్హం. ఇక తన పైన అభిమానుల సంఖ్య గురించి చెప్పక్కర్లేదు. తాను హీరో గా అభిమానుల ముందుకు రావడం విశేషం.

Leave a Response