నాకు కొత్తేమి కాదు…

తెలుగు, తమిళ్ భాషల్లో నటించిన భారతీయ నటి. కెరియర్ తొలినాళ్ళలో మోడలింగ్ చేసిన సమంత 2007లో రవి వర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ తన తొలి చిత్రమైన ఏ మాయ చేశావే సినిమాతో 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆపై తను నటించిన బృందావనం, దూకుడు (2011), ఈగ (2012), ఎటో వెళ్ళిపోయింది మనసు (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), అత్తారింటికి దారేది (2013) చిత్రాలతో అతితక్కువ సమయంలోనే తెలుగునాట ప్రముఖ కథానాయికగా ఎదిగింది. మరోపక్క ఈగ ఏకకాల తమిళ నిర్మాణం నాన్ ఈ, ఎటో వెళ్ళిపోయింది మనుసు ఏకకాల తమిళ నిర్మాణం నీదానే ఎన్ పొన్వసంతం సినిమాలతో తమిళంలో గుర్తింపు సాధించిన సమంత ఆపై అంజాన్ (2014), కత్తి (2014) సినిమాలతో తమిళనాట కూడా ప్రముఖ కథానాయికగా ఎదిగింది. 2013లో రేవతి తర్వాత ఒకేసారి అటు తెలుగులోనూ, ఇటు తమిళంలోనూ దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని ఒకేసారి ఒకే ఏడాదిలో అందుకున్న నటిగా కూడా సమంత ప్రసిద్ధి గాంచింది.ఇళ్ల ఎన్నోసినిమాల్లో నటించించి తన కంటూ ఓ స్థాయిని తెచ్చేకుంది. చేతుతో పెళ్లి త‌ర్వాత కూడా వ‌రుస సినిమాలతో బిజీగా ఉన్న స‌మంత సోష‌ల్‌మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. వీలైన‌పుడ‌ల్లా పోస్టులు పెడుతుంటుంది. త‌న సినిమా విష‌యాల‌ను, ఫోటోషూట్ల‌ను పోస్ట్ చేస్తుంటుంది. అయితే స‌మంత కాస్త గ్లామ‌ర‌స్ ఫోటో పోస్ట్ చేయ‌గానే నెటిజ‌న్ల నుంచి వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతుంది. వాటికి స‌మంత కూడా గ‌ట్టిగానే రిప్లైలు ఇస్తుంటుంది. ప్ర‌స్తుతం ఓ బేబీ సినిమా ప్ర‌మోష‌న్ కార్యక్ర‌మాల్లో పాల్గొంటున్న స‌మంత త‌న‌పై జ‌రిగే ట్రోలింగ్ గురించి స్పందించింది. నాకు ట్రోలింగ్ కొత్త కాదు. మొద‌ట్లో ఈ ట్రోలింగ్ నాకు చాలా చిరాకు తెప్పించేది. ఎందుకు న‌న్ను అన‌వ‌స‌రంగా విమ‌ర్శిస్తున్నార‌ని బాధ‌నిపించేది. వాటి గురించే ఆలోచించి పిచ్చిదాన్ని అయిపోతానేమో అని భ‌యం వేసేది. ప్ర‌స్తుతం దాన్నుంచి బ‌య‌ట‌ప‌డ్డాను. నేను ట్వీట్ చేసినా, ఫోటో పోస్ట్ చేసినా ట్రోల్ జ‌రుగుతుంద‌ని నాకు తెలుసు. న‌న్ను విమ‌ర్శించ‌డానికి కొంద‌రు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు వాటి గురించి ఆలోచించ‌డం మానేశాను. ఎవ‌రైనా నా గురించి చెడుగా కామెంట్ చేసినా దానిని నేను డిలీట్ కూడా చేయ‌డం లేద‌ని స‌మంత చెప్పడం విశేషం. తాను చెప్పిన ఈ మాటలు టాలీవుడ్ లో వైరల్ గా మారింది.

Image result for samantha

Leave a Response